IPL 2023 | RR vs LSG: రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో గెలుపు
IPL 2023, RR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IPL 2023, RR vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. దీంతో లక్నో 10 పరుగుల తేడాతో గెలిచింది.
156 పరుగుల ఓ మోస్తారు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 44(35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్40(41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్థశతకానికి చేరువైన జైశ్వాల్‌ను స్టోయినిస్ ఔట్ చేయడంతో వికెట్ల పతనం ఆరంభమైంది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. ఇదే సమయంలో రాజస్థాన్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్(1) రనౌట్ కాగా, కుదరుకున్న బట్లర్‌తో పాటు ఫామ్‌లో ఉన్న హెట్మయర్(2) కూడా ఔట్ కావడంతో 104 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. దేవదత్ పడిక్కల్ 26( 21 బంతుల్లో 4×4) ఆఖర్లో పోరాడాడు. కానీ రియాన్ పరాగ్(15 నాటౌట్)లు ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోవడంతో కేవలం 10 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి చవిచూసింది.
లక్నో బౌలర్లో అవేష్ ఖాన్ 3 వికెట్లు, స్టోయినిస్ 2 వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలో దిగిన కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ 10 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. 11వ ఓవర్లో జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా లక్నో వికెట్లు కోల్పోయింది. స్టాయినిస్ 21 పరుగులు, నికోలస్ పూరన్ 28 పరుగులు చేశారు. కైల్ మేయర్స్ అర్థ శతకంతో రాణించడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 154 పరుగులు చేయగలిగింది.
రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు, ట్రెంట్, సందీప్ శర్మ, హోల్డర్ ఒక్కో వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

