IPL 2023 : పదిహేనో సీజన్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్(RR) ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)పై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. జోస్ బట్లర్(54), యశస్వీ జైస్వాల్ (54), కెప్టెన్ సంజూ శాంసన్(55) హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడడంతో 203 రన్స్ చేసింది. కొండంత లక్ష్య ఛేదనలో హైదరాబాద్ బ్యాటర్లు విఫలం అయ్యారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. యజువేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో హైదరాబాద్ 131 రన్స్‌కే పరిమితమైంది. సొంత గడ్డపై ఓటమితో అభిమానులను నిరాశ పరిచింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు తొలి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ షాకిచ్చాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ(0), రాహుల్ త్రిపాఠి(0) డకౌట్ చేశాడు. హ్యారీ బ్రూక్(13), మయాంక్ ఇద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్‌బోర్డు వేగం పెంచారు. మూడో వికెట్‌కు 34 రన్స్ జోడించారు. చాహల్ బ్రూక్‌ను ఔట్ చేయడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. 34 రన్స్‌కే ముగ్గురు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో కష్టాల్లో పడింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(25) టాప్ స్కోరర్. వాషింగ్టన్ సుందర్(), గ్లెన్ ఫిలిఫ్స్ (8) తక్కువకే ఔటయ్యారు. 81 రన్స్ వద్ద ఆదిల్ రషీద్ (18) స్టంపౌట్ అయ్యాడు. దాంతో, వంద లోపై ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, అబ్దుల్ సమద్ (32),ఉమ్రాన్ మాలిక్ (19) చివర్లో ధాటిగా ఆడడంతో 130 ప్లస్ స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు, ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశారు. అశ్విన్, హోల్డర్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ రెండొందలు కొట్టింది. కీలక బ్యాటర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 203 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఏకంగా ముగ్గురు హాఫ్ సెంచరీలు బాదారు. జోస్ బట్లర్(54), యశస్వీ జైస్వాల్ (54), కెప్టెన్ సంజూ శాంసన్(55) హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆఖర్లో షిమ్రాన్ హెట్మెయిర్(22)దంచి కొట్టడంతో ఆ జట్టు రెండొందలు చేయగలిగింది. ఫారుఖీ వేసిన 20వ ఓవర్లో హెట్మెయిర్ ఫోర్ కొట్టి స్కోర్ రెండొందలు దాటించాడు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్హక్ ఫారుఖీ, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్‌కు ఒక వికెట్ దక్కింది.