IPL 2023 | GT Vs RCB మ్యాచ్‌కు వరుణ గండం.. బెంగళూరులో కుంభవృష్టి.. ఆర్సీబీకి కలిసొచ్చేనా.. చెడగొట్టేనా..?
IPL 2023 | ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆఖరిది అయిన 70వ లీగ్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణ గండం ఎదురైంది. ఎందుకంటే బెంగళూరులో ప్రస్తుతం కుంభవృష్టి కురుస్తున్నది.
బెంగళూరు: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆఖరిది అయిన 70వ లీగ్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణ గండం ఎదురైంది. ఎందుకంటే బెంగళూరులో ప్రస్తుతం కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో మ్యాచ్ జరిగేది అనుమానంగా ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్సీబీకి కలిసొస్తుందా.. లేదంటే ఆ జట్టు పుట్టి మునుగుతుందా అనేది మరో రెండు గంటల్లో తేలనుంది.
ఎందుకంటే ప్రస్తుతం ముంబైలో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 69వ లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచి, వర్షం కారణంగా తర్వాత మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ పుట్టి మునుగుతుంది. ఎలాగంటే పాయింట్స్ టేబుల్లో ఇప్పుడు ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ చెరో 14 పాయింట్లతో సమంగా ఉన్నాయి. SRHతో మ్యాచ్ గెలిస్తే ముంబై ఇండియన్స్ పాయింట్స్ సంఖ్య 16కు పెరుగుతుంది. వర్షంవల్ల GTతో ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ పాయింట్స్ సంఖ్య 15 అవుతుంది. అప్పుడు ఒక్క పాయింట్ తేడాతో MI ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.
ఒకవేళ SRHతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ ఓడిపోయి, GT vs RCB మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మాత్రం ఆర్సీబీకి కలిసొస్తుంది. అదెలాగంటే SRHతో మ్యాచ్ ఓడిపోతే ముంబై ఇండియన్స్ పాయింట్స్ సంఖ్య 14 వద్దే ఉండిపోతుంది. GTతో మ్యాచ్ వర్షంవల్ల తుడిచిపెట్టుకుపోతే ఆర్సీబీ పాయింట్స్ సంఖ్య 15కు పెరుగుతుంది. అప్పుడు ఒక్క పాయింట్ తేడాతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. కాబట్టి ఆర్సీబీ, ముంబై జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుతుందనేది ఆయా జట్ల జయాపజయాలే కాకుండా వర్షం కూడా నిర్ణయిస్తుందని చెప్పవచ్చు.
ఇదిలావుంటే వర్షం కారణంగా GT vs RCB మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా మూసుకుపోనున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం RR కూడా పాయింట్స్ టేబుల్లో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నది. SRHతో ముంబై ఇండియన్స్, GTతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారంగా RR ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ SRHతో ముంబై ఓడినా, GT vs RCB మ్యాచ్ వర్షంవల్ల రద్దయితే ఆర్సీబీ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది కాబట్టి RRకు అవకాశం ఉండదు.
Evening rains over Chinnaswamy stadium, #Bengaluru
VC: Vinay Gowda#RCBvsGT #RCB #KarnatakaRains #BengaluruRains #BangaloreRains #Bangalore #IPL2023 #RCBvGT #Bangalore pic.twitter.com/qzSGF70lFK
— Karnataka Weather (@Bnglrweatherman) May 21, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

