IPL 2023 | గుజరాత్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. పాండ్యా కెప్టెన్ ఇన్సింగ్స్ వృథా
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో మరో టఫ్ ఫైట్. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ. ఒత్తిడిని జయించిన ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చింది. హార్దిక్ పాండ్యా(51) కెప్టెన్ ఇన్నింగ్స్, రాహుల్ తెవాటియా(20) మెరుపు బ్యాటింగ్ చేసినా సరిపోలేదు. ఆఖరి ఓవర్లో ఇషాంత్ వికెట్ తీయడంతో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో మరో టఫ్ ఫైట్. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ. ఒత్తిడిని జయించిన ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చింది. హార్దిక్ పాండ్యా(51) కెప్టెన్ ఇన్నింగ్స్, రాహుల్ తెవాటియా(20) మెరుపు బ్యాటింగ్ చేసినా సరిపోలేదు. ఆఖరి ఓవర్లో ఇషాంత్ వికెట్ తీయడంతో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేజింగ్‌లో తమకు తిరుగులేదని పాండ్యాసేనను చిత్తు చేసింది.
ఇషాంత్ వేసిన 20వ ఓవర్లో 12 పరుగులు కావాలి. నాలుగో బంతికి రాహుల్ తెవాటియా(20) ఔటయ్యాడు. రషీద్ ఖాన్(2) రెండు రన్స్ తీశాడు. ఆఖరి బంతికి 7 రన్స్ అవసరమయ్యాయి. రషీద్ ఒక్క పరుగు తీశాడంతే. దాంతో, ఢిల్లీ 5 పరుగుల తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్యా(59) నాటౌట్‌గా నిలిచాడు.
పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్
స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ ఆఖరి బంతికి వృద్ధిమాన్ సాహా(0) ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్(6)ను నార్జ్ పెవిలియన్ పంపాడు. విజయ్ శంకర్(6)ను ఇషాంత్ శర్మ, డేంజరస్ డేవిడ్ మిల్లర్(0)ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశారు. దాంతో 32 రన్స్‌కే 4 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(59), అభినవ్ మనోహర్ (26) ఆదుకున్నారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా(20) దంచినా సరిపోలేదు.
అమన్ హకీం ఫిఫ్టీ
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల తీరు మారలేదు. షమీ చెలరేగడంతో టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అమన్ హకీం ఖాన్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో, 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ కొట్టింది. కష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన అమన్ 41 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. అతడికి అక్షర్ పటేల్(27), రిపల్ పటేల్(23) సహకారం అందించారు. వీళ్లు ఆరో, ఏడో వికెట్‌కు 50 రన్స్ జోడించడంతో ఢిల్లీ పోరాడగలిగే స్కోర్ చేసింది. ఫిలిఫ్ సాల్ట్(0), రిలే రస్సో(8), మనీశ్ పాండే(1), ప్రియం గార్గ్(10)ను పెవిలియన్ పంపి షమీ ఢిల్లీని దెబ్బకొట్టాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

