భారత్‌లో ఐపీఎల్ పండుగ మొదలైపోయింది. శనివారం నాడు కోల్‌కత నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లోనే సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన రికార్డు సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ గుర్తున్నాడా?
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు మలింగ పేరిటే ఉంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పేస్ కోచ్‌గా ఉన్న మలింగ.. 122 మ్యాచుల్లో 170 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా ఆడలేదు. ఇప్పుడు ఆ రికార్డును డ్వేన్ బ్రావో సమం చేశాడు.
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన బ్రావో.. 170 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరొక్క వికెట్ తీశాడంటే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బ్రావో రికార్డు సాధిస్తాడు. బ్రావో మూడు వికెట్లతో సత్తా చాటినా కూడా ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమి చవిచూసింది.