IND vs ZIM: భారత్ ఘన విజయం.. సిరీస్‌లో ముందంజ
IND vs ZIM: జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో ముందంజ వేసింది.
IND vs ZIM: జింబాబ్వే పర్యటనలో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆతిథ్య జట్టుతో హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 159-6 వద్దే ఆగిపోయింది. ఆ జట్టులో డియోన్ మైయర్స్ (49 బంతుల్లో 65 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్సర్), క్లైవ్ మదండె (26 బంతుల్లో 37, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (3-15), అవేశ్ ఖాన్ (2-39) రాణించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజ వేసింది. వాషింగ్టన్ సుందర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారీ ఛేదనలో జింబాబ్వేకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అవేశ్ ఖాన్ వేసిన ఆ ఓవర్లో ఓపెనర్ వెస్లీ మద్వెరె (1) అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. మరుమని (13)ని ఖలీల్ అహ్మద్ 3వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. ప్రమాదకర బ్రియాన్ బెన్నెట్ (4)ను అవేశ్ ఖాన్ ఔట్ చేయగా కెప్టెన్ సికందర్ రజా (15) మరోసారి విఫలమయ్యాడు. జొనాథన్ క్యాంప్‌బెల్ (1) నిరాశపరిచాడు. ఈ రెండు వికెట్లూ సుందర్ ఖాతాలోకే వెళ్లాయి. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే 7 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న మైయర్స్, క్లైవ్
39 పరుగులకే 5 వికెట్లు నష్టపోయిన జింబాబ్వేను మైయర్స్, క్లైవ్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను సమర్థంగా అడ్డుకున్నారు. వేగంగా ఆడకపోయినా వికెట్లను కాపాడుకున్నారు. ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన ఈ జోడీని ఎట్టకేలకు సుందర్ విడదీశాడు. 17వ ఓవర్లో క్లైవ్ రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత జింబాబ్వే బ్యాటర్ల పోరాటం ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (66), రుతురాజ్ గైక్వాడ్ (49), యశస్వీ జైస్వాల్ (36) రాణించారు. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 ఈనెల 13న (శనివారం) ఇదే వేదికపై జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

