INDvsSA 1st Test: ఎల్గర్ అజేయ శతకం.. రెండో రోజూ సఫారీలదే ఆధిక్యం
INDvsSA 1st Test: భారత్‌ను 245 పరుగులకే పరిమితం చేసిన దక్షిణాఫ్రికా.. రెండో రోజు ఆ స్కోరును అధిగమించడంతో పాటు ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న సఫారీ మాజీ సారథి డీన్ ఎల్గర్ అజేయ శతకంతో చెలరేగాడు.
INDvsSA 1st Test: స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండో రోజూ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్‌ను 245 పరుగులకే పరిమితం చేసిన దక్షిణాఫ్రికా.. రెండో రోజు ఆ స్కోరును అధిగమించడంతో పాటు ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న సఫారీ మాజీ సారథి డీన్ ఎల్గర్ (211 బంతుల్లో 140 నాటౌట్, 23 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా తొలి టెస్టు ఆడుతున్న డేవిడ్ బెడింగ్హామ్ (87 బంతుల్లో 56, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ సెంచరీతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ప్రస్తుతం సఫారీలు.. 11 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు.
అంతకుముందు భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కెఎల్ రాహుల్ (101) సెంచరీతో రాణించాడు. రెండో రోజు ఏడు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన భారత్.. రాహుల్ ఔటవడంతో పెవలియన్ చేరింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీలు.. ఓపెనర్ మార్క్రమ్ (5) వికెట్ త్వరగా కోల్పోయినా తర్వాత పుంజుకున్నారు. టోని డీ జోర్జి (23)తో రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించిన ఎల్గర్.. అతడు నిష్క్రమించినా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు.
140 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న అతడు ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. అతడికి డేవిడ్ బెడింగ్హమ్ నుంచి చక్కని సహకారం లభించింది. టీ విరామం తర్వాత అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న బెడింగ్‌హమ్‌ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో 131 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ప్రసిధ్.. వికెట్ కీపర్ కైల్ వెరియన్నెను ఔట్ చేయడంతో సఫారీలు ఐదో వికెట్ కోల్పోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

