INDvsNZ: వాంఖడేలో విరాట్ విశ్వరూపం.. సచిన్ రికార్డు బ్రేక్.. వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర
INDvsNZ: వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్ లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర లిఖించాడు. తాను ఎంతగానో ఆరాధించే సచిన్ టెండూల్కర్ ఎదుటే మాస్టర్ బ్లాస్టర్ 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు.
INDvsNZ: సచిన్ రికార్డులను బ్రేక్ చేయడం సాధ్యమా..? బ్రేక్ సంగతి పక్కనబెట్టి కనీసం ఆ దరిదాపుల్లోకి అయినా ఎవరైనా వస్తారా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ.. తాను ఎంతగానో ఆరాధించే సచిన్ టెండూల్కర్ ఎదుటే అతడి రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేలలో సచిన్ పేరిట ఉన్న 49 శతకాల రికార్డు (వన్డేలలో) ను ఇటీవలే సమం చేసిన విరాట్.. నేడు మాస్టర్ బ్లాస్టర్ ఎదురుగానే ఆ రికార్డును తుడిచేసి 50వ శతకాన్ని నమోదుచేశాడు. నెల రోజులుగా భారత్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో కోహ్లీ రెండు సెంచరీలు చేసినా మరో రెండు సార్లు దానికి దగ్గరగా వచ్చి ఔటయ్యాడు.
ముంబైలో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఒక్కో పరుగు కూడగడుతూ 59 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. అనంతరం దూకుడు పెంచాడు. సౌథీ వేసిన 30వ ఓవర్లో సిక్సర్ బాదిన విరాట్.. తర్వాత బౌల్ట్, ఫిలిప్స్, సౌథీలు వేసిన ఓవర్లలో ఫోర్లు కొట్టాడు. బౌల్డ్ వేసిన 36వ ఓవర్లో మరో ఫోర్ కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. 90లలోకి వచ్చాక కాస్త నెమ్మదించిన కోహ్లీ.. ఫెర్గూసన్ వేసిన 42వ ఓవర్లో డబుల్ తీసి 50వ శతకాన్ని పూర్తిచేశాడు. వన్డే క్రికెట్లో సచిన్.. 462 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేయగా కోహ్లీ మాత్రం 279 ఇన్నింగ్స్‌లలోనే సెంచరీల అర్థసెంచరీలు చేయడం గమనార్హం.
వన్డేలలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్-5 బ్యాటర్లు:
విరాట్ కోహ్లీ (50.. 279 ఇన్నింగ్స్‌లలో)
సచిన్ టెండూల్కర్ (49.. 462 ఇన్నింగ్స్)
రోహిత్ శర్మ (31.. 253 ఇన్నింగ్స్)
రికీ పాంటింగ్ (30.. 365 ఇన్నింగ్స్)
సనత్ జయసూర్య (28.. 433 ఇన్నింగ్స్)
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (టాప్-5):
సచిన్ – 100
కోహ్లీ – 80
పాంటింగ్ – 71
సంగక్కర – 63
కలిస్ – 62
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

