INDvsNZ: ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్.. నాలుగేండ్ల పగ చల్లారింది!
INDvsNZ: పుష్కరకాలం తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరింది. 2011 తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న విశ్వకప్ లో కివీస్ ను ఓడించింది. షమీ విజృంభణతో భారత్ సెమీస్ గండాన్నిదాటింది.
INDvsNZ: నాలుగేండ్ల నాటి పగ చల్లారింది. భారత క్రికెట్ అభిమానులను ఇప్పటికీ వేధించే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఓటములకు భారత్ బదులు తీర్చుకుంది. ఐసీసీ టోర్నీలలో సెమీస్ గండాన్ని దాటలేక చతికిలపడుతున్న భారత్.. ఎట్టకేలకు ఆ ముప్పు తప్పించుకుంది. ముంబైలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసినా కివీస్ పోరాటంతో ఒకదశలో ‘ఇంత స్కోరు చేసినా గెలుస్తామా..?’ అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 398 పరుగుల ఛేదనలో కివీస్ తుదికంటా పోరాడి ఓడింది. ఛేదనలో ఆ జట్టు.. 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్.. 70 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్ (119 బంతుల్లో 134, 9 ఫోర్లు, 7 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (73 బంతుల్లో 69, 9 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్లలో షమీ ఏడు వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
భారీ ఛేదనలో కివీస్‌కు ఆరంభంలోనే షమీ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. డెవాన్ కాన్వే (15 బంతుల్లో 13, 3 ఫోర్లు), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 13, 3 ఫోర్లు)లను షమీ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. 30 పరుగులకే ఆ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్ లు కివీస్‌ను ఆదుకున్నారు.
మిచెల్ – కేన్ కీలక భాగస్వామ్యం..
ఓపెనర్లు వెంటవెంటనే నిష్క్రమించినా కివీస్ ఈ మ్యాచ్‌లో ఇక్కడిదాకా వచ్చిందంటే అది మిచెల్ – విలియమ్సన్ల పోరాటమే. ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకునేదాకా కాస్త ఓపికగా ఆడినా తర్వాత పుంజుకున్నారు. ఒకరిని మించి ఒకరు బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీళ్లిద్దరి జోరుకు భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తేలిపోయారు. వికెట్ల కోసం ఎంత ప్రయత్నించినా భారత బౌలర్లకు నిరాశే మిగిలింది. 49 బంతుల్లో మిచెల్ అర్థ సెంచరీ పూర్తవగా 58 బంతుల్లో కేన్ మామ హాఫ్ సెంచరీ పూర్తయింది. అర్థ సెంచరీల తర్వాత ఈ ఇద్దరూ గేర్ మార్చారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ మిచెల్.. 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. బుమ్రా వేసిన 29వ ఓవర్లో ఐదో బంతికి షమీ.. విలియమ్సన్ క్యాచ్ మిస్ చేయడంతో కేన్ మామ బతికిపోయాడు.
మళ్లీ పోటీలోకి తెచ్చిన షమీ..
ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని డ్రింక్స్ బ్రేక్ తర్వాత షమీ విడదీశాడు. షమీ వేసిన 33వ ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ ఆడబోయిన కేన్ మామ.. సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి టామ్ లాథమ్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌లో భారత్ మళ్లీ పోటీలోకి వచ్చింది.
మిచెల్ పోరాడినా..
వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో కివీస్ కథ ముగిసినట్టే అనిపించినా మిచెల్ పోరాటాన్ని వీడలేదు. లాథమ్ స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (33 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి భారత్‌ను భయపెట్టాడు. ఈ ఇద్దరూ 61 బంతుల్లో 75 పరుగులు జతచేశారు. సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ జోడీ లక్ష్యాన్ని కరిగించి భారత్‌ను చికాకుపెట్టింది. సిరాజ్ వేసిన 39వ ఓవర్లో 12 పరుగులు రాగా 41వ ఓవర్లో ఫిలిప్స్.. రెండు సిక్సర్లు ఒక ఫోర్ బాది 20 పరుగులు పిండుకున్నాడు. కానీ బుమ్రా ఈ జోడీని విడదీశాడు. అతడువేసిన 43వ ఓవర్లో ఐదో బంతికి ఫిలిప్స్ భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్‌లో జడ్డూ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. ఆ తర్వాత వచ్చిన మార్క్ చాప్మన్ (2)ను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. సహచర ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్న క్రమంలో ఒత్తిడికి లోనైన మిచెల్.. షమీ వేసిన 46వ ఓవర్లో జడేజాకు క్యాచ్ ఇవ్వడంతో అతడి పోరాటం ముగిసింది. ఈ మ్యాచ్‌లో షమీకి ఇది ఐదో వికెట్..
మిచెల్ నిష్క్రమణతో కివీస్ పోరాటం ముగిసింది. ఆ తర్వాత లోయరార్డర్ చేసిన పరుగులు కివీస్ ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప విజయం దిశగా సాగలేదు. ఈ విజయంతో భారత్.. వరల్డ్ కప్ – 2023 ఫైనల్లో ప్రవేశించింది. గురువారం కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా – ఆసీస్మధ్య జరుగబోయే మ్యాచ్ విజేతతో ఈనెల 19న తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

