INDvsAUS Live: జగజ్జేత ఆసీస్.. ఇండియాకు మళ్లీ నిరాశే.. కంగారూలదే వన్డే వరల్డ్ కప్
INDvsAUS Live: వరుసగా పది మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్ చేరినా అభిమానుల్లో ఏ మూలనో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ రోహిత్ సేన తుది మెట్టుపై బొక్క బోర్లా పడింది.
INDvsAUS Live: కొత్తగా ఏం జరుగలేదు. వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీ మొత్తం అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్‌తో ఇరగదీసిన భారత్.. ఫైనల్లో ఎప్పటిలాగే తడబడింది. వరుసగా పది మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్ చేరినా అభిమానుల్లో ఏ మూలనో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ రోహిత్ సేన తుది మెట్టుపై బొక్క బోర్లా పడింది. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు నాసిరకమైన బౌలింగ్‌తో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్ (120 బంతుల్లో 137, 15 ఫోర్లు, 4 సిక్సర్లు), సెంచరీతో చెలరేగగా మార్నస్ లబూషేన్ (110 బంతుల్లో 58 నాటౌట్, 4 ఫోర్లు)రాణించి ఆసీస్‌కు ఆరోసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని అందించారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు వరుసగా షాకులు తాకాయి. రెండో ఓవర్లోనే షమీ.. డేవిడ్ వార్నర్ (7)ను ఔట్ చేయగా మిచెల్ మార్ష్ (15)ను బుమ్రా ఐదో ఓవర్లో ఔట్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే బుమ్రా.. స్మిత్ (4) ను కూడా ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్, టీమిండియా అభిమానులు ఆనందపడిన క్షణాలంటే ఇవే. ఆ తర్వాత, అంతకుముందూ అంతా ఆసీస్‌దే ఆధిపత్యం..
దంచికొట్టిన హెడ్..
47 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో ట్రావిస్ హెడ్ మరోసారి ఆ జట్టుకు ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. భారత బౌలర్లు కట్టడి చేసినప్పుడు సంయమనంతో ఆడిన హెడ్ ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పాడు. లబూషేన్ కూడా అతడికి తోడ్పాడునందించడంతో హెడ్ వీరవిహారం చేశాడు. అర్థ సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచిన హెడ్.. 95 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. హెడ్ – లబూషేన్‌లు క్రీజులో పాతుకుపోవడంతో భారత్‌కు వికెట్ల రాకే గగనమైంది. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌కు తిరుగులేని విజయాన్ని అందించి భారత అభిమానులకు మరోసారి గుండెకోతను మిగిల్చారు. పుష్కరకాలం తర్వాత స్వదేశంలో కప్పు గెలవాలన్న భారత కల మరోసారి చెదిరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

