న్యూయార్క్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. జులియస్ బేర్ జనరేషన్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. రౌండ్ రాబిన్ నాకౌట్ విధానంలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో శనివారం అర్జున్.. లియామ్ క్వాంగ్ లీ (వియత్నాం)పై విజయం సాధించాడు. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, వరల్డ్ చాంపియన్ కార్ల్సన్తో అర్జున్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.