దుబాయ్: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌లో స్థిరంగా కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 838 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉండగా, పాకిస్థాన్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత ఆటగాడు సూర్యకుమార్.