పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్‌కు తొలిరౌండ్లోనే కఠినమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు.మొదటి రౌండ్లో అతడు.. ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈనెల 26 నుంచి మొదలుకాబోయే ఈ టోర్నీలో మట్టికోర్టు మహారాజు రఫెల్ నాదల్.. ఫస్ట్ ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు.
నాదల్కు ఇదే ఆఖరి (?) ఫ్రెంచ్ ఓపెన్‌గా భావిస్తున్న నేపథ్యంలో తొలి రౌండ్లోనే అతడికి కఠిన గమనార్హం. డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్.. హ్యూగ్స్ హార్బర్ట్ (ఫ్రెంచ్)తో తొలి మ్యాచ్ ఆడనున్నాడు.