న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ప్లేయర్ కర్మన్‌కౌర్ థండి రెండో ఐటీఎఫ్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. అమెరికా వేదికగా జరిగిన డబ్ల్యూ60 ఐటీఎఫ్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో 25 ఏండ్ల కర్మన్ 7-5, 4-6, 6-1తో యులీలా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది.
తద్వారా హైదరాబాదీ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తర్వాత అమెరికా గడ్డపై ప్రొ టైటిల్ నెగ్గిన రెండో భారత మహిళగా కర్మన్ నిలిచింది. నిరుడు తొలి ఐటీఎఫ్ టోర్నీ గెలిచిన కర్మన్‌కు ఓవరాల్‌గా ఇది కెరీర్లో నాలుగో టైటిల్. ఈ విజయంతో 49 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ర్యాంకింగ్ పాయింట్స్ కర్మన్ ఖాతాలో చేరాయి.