ఫైనల్లో ప్రజ్ఞానంద
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్రాత్మక విజ యం సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లి కొత్త చరిత్ర లిఖించాడు. రౌండ్ రౌండ్‌కు తన ఆటతీరుకు మరింత మెరుగులు అద్దుకుంటూ ప్రజ్ఞా నంద..
- ఫాబియానోపై సంచలన విజయం
బాకు(అజర్బైజాన్): భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్రాత్మక విజ యం సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లి కొత్త చరిత్ర లిఖించాడు. రౌండ్ రౌండ్‌కు తన ఆటతీరుకు మరింత మెరుగులు అద్దుకుంటూ ప్రజ్ఞా నంద.. టైటిల్ ఫెవరేట్లను మట్టికరిపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన సెమీస్ పోరులో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో ప్రపంచ మూడో నంబర్ ప్లేయర్ ఫాబియానో కరునపై సంచలన విజయం సాధించాడు.
ఇద్దరి మధ్య రెండు క్లాసిక్ గేములు 1-1తో డ్రా కావడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఫాబియానోను కట్టడి చేయడంలో యువ జీఎం పూర్తిగా సఫలమయ్యాడు. ఏ దశలోనూ పుంజుకునేందుకు అవకాశమివ్వని ఎత్తుకు పైఎత్తు వేస్తూ అమెరికా జీఎంను ఓడించాడు. ఇక ఇప్పటికే ఫైనల్ చేరుకున్న ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్తో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాడు. రెండు, మూడు స్థానాల కోసం ఫాబియానో, అబసోవ్ మధ్య పోరు జరుగనుంది.
మెగాటోర్నీలో టాప్-3లో నిలువడం ద్వారా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్ టోర్నీకి ప్రజ్ఞానంద అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మెగాటోర్నీలో ఫైనల్ చేరిన ప్రజ్ఙానందను చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్లో ప్రత్యేకంగా అభినందించాడు.
2 చెస్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరుకున్న రెండో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద. ఇంతకుముందు ఈ ఘనతను విశ్వనాథన్ ఆనంద్ దక్కించుకున్నాడు.
3 క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించిన మూడో అతిపిన్న వయస్కునిగా ప్రజ్ఞానంద (18 ఏండ్లు) నిలిచాడు.
బాబీ ఫిషర్, కార్ల్సన్.. ముందువరుసలో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

