పడగొట్టి.. నిలిచారు.. రెండో టీ20లో భారత మహిళల విజయం

హోవ్: యువ సంచలనం షఫాలీ వర్మ (38 బంతుల్లో 48; 8ఫోర్లు, ఓ సిక్స్) బ్యాటింగ్‌లో దుమ్మురేపితే.. చివర్లో స్పిన్నర్లు ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టడంతో రెండో టీ20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌సేన 8 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లిష్ జట్టును చిత్తుచేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఓపెనర్ షఫాలీ మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (31) స్మృతి మంధాన (20) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఓపెనర్ టామీ బ్యూమౌంట్ (59) విజృంభించడంతో ఓ దశలో 13.4 ఓవర్లకే 106 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ను భారత స్పిన్నర్లు పూనమ్ యాదవ్ (2/17), దీప్తిశర్మ (1/18), స్నేహ్ రాణా (0/21) అద్భుతంగా కట్టడి చేశారు. చివరి 5 ఓవర్లలో 33 పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

