హైదరాబాద్, ఆట ప్రతినిధి: బౌల్డర్‌హిల్స్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నీలో భారత స్టార్ గోల్ఫర్ శుభాంకర్శర్మ టైటిల్ దిశగా దూసుకెళుతున్నాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతున్న శుభాంకర్ ప్రస్తుతం 20 అండర్ 196 స్కోరుతో ఏడు షాట్ల ఆధిక్యంలో కొనసాగుత్నునాడు. ఈ క్రమంలో హనీ బైసోయా(66-66-44) రికార్డును 29 ఏండ్ల శుభాంకర్ సమం చేశాడు.
రెండు సార్లు డీపీ వరల్డ్ విజేత అయిన శుభాంకర్ మూడో రోజు ఆటలో ఏకంగా తొమ్మిది బర్డీలు సాధించగా, కేవలం ఒక్క బోగీకే పరిమితమయ్యాడు. మరోవైప రషీద్‌ఖాన్(67-70-66). అంగద్ చీమా(68-69-66), హైదరాబాదీ విశేష్శర్మ(65-70-68) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.