దుబాయ్: భారత స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 879 రేటింగ్ పాయింట్లతో తన టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ 2,4వ ర్యాంకుల్లో ఉన్నారు.
మహ్మద్ సిరాజ్ 12వ స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వరుసగా 14, 15వ ర్యాంకుల్లో నిలిచారు. బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 750 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (730) 9వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.