Shubman Gill | శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
Shubman Gill | భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో గిల్ అగ్రస్థానంలో నిలిచాడు.
Shubman Gill | భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో పోరులో గిల్ ఈ ఘనత తన పేరిట రాసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. వన్డేల్లో రెండు వేల పరుగులు చేసేందుకు గిల్‌కు 38 ఇన్నింగ్స్‌లు అవసరం పడగా.. 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ దాటిన దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా రెండో స్థానంలో ఉన్నాడు.
కివీస్‌తో పోరులో ఏడో ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టడం ద్వారా శుభ్‌మన రెండు వేల పరుగుల మైలురాయిని దాటాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అనంతరం ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న శుభ్‌మన్ ఇప్పటికే లెక్కకు మిక్కిలి ఘనతలు తన పేరిట లిఖించుకొని.. విశ్లేషకులతో ప్రిన్స్ (యువరాజు) అనిపించుకున్న విషయం తెలిసిందే.
వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపగలడు అనుకున్న ఈ పంజాబ్‌కా పుత్తర్.. మెగాటోర్నీకి ముందు డెంగ్యూ బారిన పడి కీలక మ్యాచ్‌లకు దూరమైనా.. కోలుకొని తిరిగి వచ్చిన తర్వాత తన ప్రతాపం చూపుతున్నాడు. తాజాగా కివీస్‌తో పోరులోనూ భారీ ఎడాపెడా బౌండ్రీలతో దంచికొట్టిన శుభ్‌మన 26 పరుగుల వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకుంటున్న దశలో ఫెర్గూసన్ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. బౌండ్రీకి అతి సమీపంలో మిషెల్ చేతికి చిక్కాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

