జైజై జెరెమీ.. స్వర్ణం నెగ్గిన యువ లిఫ్టర్
- బింద్యారాణికి రజతం
- క్వార్టర్స్‌లో నిఖత్ జరీన్
- కామన్వెల్త్ గేమ్స్
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత లిఫ్టర్లు దుమ్మురేపుతున్నారు. రికార్డు బరువెత్తి మీరాబాయి చాను పసిడి పతకం కైవసం చేసుకుంటే.. ఇప్పుడదే బాటలో నడుస్తూ జెరెమీ లాల్రినుంగా స్వర్ణ కాంతులు విరజిమ్మాడు. జూనియర్ స్థాయిలో అద్వితీయ ప్రదర్శనలతో అంచనాలు పెంచిన జెరెమీ.. బర్మింగ్‌హామ్‌లో అందుకు తగ్గట్లే కామన్వెల్త్ రికార్డు బద్దలు కొడుతూ బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. మణిపూర్ ఆణిముత్యం బింద్యారాణి రజతం కైవసం చేసుకోవడంతో మెగాటోర్నీలో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. తొలిసారి కామన్వెల్త్ బరిలోకి దిగిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతున్నది. శనివారం పోటీల్లో మూడు పతకాలు సాధించిన మన లిఫ్టర్లు.. ఆదివారం మరో రెండు మెడల్స్ కైవసం చేసుకున్నారు. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రినుంగా పసిడి పతకం కైవసం చేసుకోగా.. మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజతం చేజిక్కించుకుంది. జెరెమీ 300 కేజీల (140+160) బరువెత్తి నయా కామన్వెల్త్ రికార్డు లిఖించాడు. అయానె 193 కేజీల (127+166)తో రజతం గెలుచుకోగా.. నైజీరియాకు చెందిన ఒమైఫా 290 కిలోల (130+160)తో కాంస్యం చేజిక్కించుకున్నాడు.
2018 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి అంచనాలు పెంచేసిన జెరెమీ అందుకు తగ్గట్లే సత్తాచాటాడు. స్నాచ్‌లో 140 కేజీల బరువెత్తి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచిన లాల్రినుంగా.. క్లీన్ అండ్ జర్క్‌లో మరింత బరువెత్తే క్రమంలో గాయపడ్డాడు. కండరాలు పట్టేయడంతో ప్రయత్నాలు విరమించుకున్నాడు. స్నాచ్ తొలి ప్రయత్నంలో 136 కేజీలు ఎత్తిపడేసిన జెరెమీ.. రెండో ప్రయత్నంలో 140 కిలోలు ఎత్తాడు.
మూడో ప్రయత్నంలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కంటే రెండు కిలోలు ఎక్కువగా.. 143 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జర్క్ తొలి ప్రయత్నంలో 154.. రెండో ప్రయత్నంలో 160 కిలోలు లేపిన జెరెమీ.. మూడో ప్రయత్నంలో 165 కేజీలు ఎత్తే క్రమంలో గాయపడ్డాడు. స్వర్ణం సాధించిన జెరెమీతో పాటు.. రజతం దక్కించుకున్న బింద్యారాణిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

