Aditi Ashok | అదితి అదరహో.. ఈ సీజన్లో రెండో గోల్ఫ్ టైటిల్ కైవసం
Aditi Ashok : ఆసియా గేమ్స్‌లో వెండి పతకంతో మెరిసిన యువ గోల్ఫర్ అదితి అశోక్(Aditi Ashok) మరోసారి సత్తా చాటింది. అండలూసియా కోస్టా డెల్ సొల్ ఓపెన్ డి ఎస్పనా టోర్నమెంట్ విజేతగా నిలిచింది. స్పెయిన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆదితి.. నెదర్లాండ్స్‌కు చెందిన అన్నె వాన్ డామ్(Anne Van Dam)పై...
Aditi Ashok : ఆసియా గేమ్స్‌లో వెండి పతకంతో మెరిసిన యువ గోల్ఫర్ అదితి అశోక్(Aditi Ashok) మరోసారి సత్తా చాటింది. అండలూసియా కోస్టా డెల్ సొల్ ఓపెన్ డి ఎస్పనా టోర్నమెంట్ విజేతగా నిలిచింది. స్పెయిన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆదితి.. నెదర్లాండ్స్‌కు చెందిన అన్నె వాన్ డామ్(Anne Van Dam)పై గెలుపొందింది. 69, 68, 68, 66 పాయింట్లతో లేడిస్ యూరోపియన్ టూర్(LET)లో రెండో టైటిల్ కొల్లగొట్టింది. 25 ఏండ్ల అదితికి ఈ సీజన్లో ఇది రెండో టైటిల్ కాగా.. మొత్తంగా ఆమెకు ఇది ఐదో ఎల్ఈటీ టైటిల్.
‘ఈ ఏడాది ఆరంభంలో కెన్యాలో మొదటి టైటిల్ గెలిచిన అదితి ఏడాది చివర్లో ట్రోఫీ సాధించడం విశేషం. నేను మొదట్లో నిదానంగా ఆడాను. మొదటి ఆరు నుంచి ఎనిమిది సార్లు గురి తప్పాను. ఏడో ప్రయత్నంలో కొద్దిలో మిస్ అయింది. అప్పుడు నాకు చాన్స్ ఉందని అనిపించింది. అన్నేతో పోరు గొప్పగా సాగింది. ఆమె మంచిగా ఆడుతున్నప్పుడు ఐదు నుంచి 10 షాట్లను గురి చూసి కొట్టగలదు. కానీ, ఈరోజు నేను పైచేయి సాధించాను’ అని అదితి తెలిపింది.
ఆసియా గేమ్స్ వెండి పతకంతో అదితి అశోక్

అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతున్న అదితి ఆసియా గేమ్స్‌లో రికార్డు నెలకొల్పింది. చైనా ఆతిథ్యం ఇచ్చిన 19వ ఆసియా గేమ్స్‌లో అదితి వెండి పతకం సాధించింది. దాంతో, ఈ టోర్నీలో పతకం గెలిచిన భారత తొలి గోల్ఫర్గా అదితి చరిత్ర సృష్టించింది.
ఇవి కూడా చదవండి
-
Minister KTR | కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధు తీసేస్తారు: మంత్రి కేటీఆర్
-
Monica Sharma | చిట్టిపొట్టి దుస్తుల్లో సెగలు పుట్టిస్తున్న మోనికా శర్మ
-
Asaduddin Owaisi: రైతు బంధును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది: అసదుద్దీన్ ఓవైసీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

