హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాష్ట్రంలో ప్రొఫెషనల్ గోల్ఫ్‌కు సరికొత్త ఊపునిస్తూ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) రెండో సీజన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. గోల్కొండలోని హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ క్లబ్లో బుధవారం మొదలైన ఈ పోటీల్లో మొత్తం పది ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.
ఈ నెల 10 వరకు లీగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా విజేతకు ఇచ్చే ట్రోఫీని ఐజీపీఎల్ సీఈవో ఉత్తమ్ సింగ్‌తో కలిసి హైదరాబాద్ గోల్ఫ్ సంఘం (హెచ్జీఏ) అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. నగరంలో మరిన్ని అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్లు నిర్వహించేందుకు కలిసి పని చేస్తామని ఇరువురు ప్రకటించారు.