ఇస్లే ఆఫ్ మ్యాన్ : ఫిడే స్విస్ చెస్ టోర్నీలో భారత చెస్ సంచలనం రమేశ్‌బాబు వైశాలి జోరు కొనసాగిస్తున్నది. నాలుగో రౌండ్లో రష్యా గ్రాండ్‌మాస్టర్ లియా గారిఫుల్లినాకు చెక్ పెట్టిన వైశాలి.. ఆదివారం అద్భుత ఆటతీరుతో మాజీ చాంపియన్ మరియా ముజిచుంక్ (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగి కేవలం 23 ఎత్తుల్లోనే మ్యాచ్ ముగించి ఐదో రౌండ్‌కు దూసుకెళ్లింది.
తద్వారా 3.5 పాయింట్లతో టాన్ ఝోంగీ(చైనా), ముజిచుంక్, అసౌబయేవా(కజకిస్థాన్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఎరిగేసి, ఆర్. ప్రజ్ఞానంద డ్రాతో సరిపెట్టుకోగా.. విదిత్ గుజరాతీ వరుసగా మూడో విజయం నమోదు చేశాడు.