విజయంతో ఆరంభం
భారత మహిళా క్రికెట్ జట్టులో స్మృతి మంధాన శకం విజయంతో మొదలైంది. శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా..
- తొలి టీ20లో జింబాబ్వేపై భారత్ గెలుపు
- రాణించిన దీప్తి, నిక్కీ
రాయ్‌పూర్: భారత మహిళా క్రికెట్ జట్టులో స్మృతి మంధాన శకం విజయంతో మొదలైంది. శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా.. 4 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. మొదట బౌలర్లు జింబాబ్వేను 114/5 కట్టడిచేస్తే ఛేదనను మంధాన సేన 15.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది.
’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దీప్తి శర్మ (37 బంతుల్లో 8 ఫోర్లతో 49) ఒత్తిడిలోనూ స్ఫూర్తిధాయక ఇన్నింగ్స్ ఆడగా అరంగేట్ర అమ్మాయి నిక్కీ ప్రసాద్ (35 బంతుల్లో 6 ఫోర్లతో 39 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. జింబాబ్వే బ్యాటర్లలో షార్నె మేయర్స్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), కుహ్లీజ్ (44 బంతుల్లో 7 ఫోర్లతో 42) రాణించారు. ఇరుజట్ల మధ్య ఈనెల 18న ఇదే వేదికలో రెండో టీ20 జరుగుతుంది.
నిలిచిన నిక్కీ.. గెలిపించిన దీప్తి
19/4. అనామక జైట్టెన జింబాబ్వేపై ఛేదనలో 3.1 ఓవర్లకు భారత స్కోరిది. ఈ స్థితి నుంచి మంధాన సేన మ్యాచ్‌ను గెలుచుకుందంటే అది దీప్తి, నిక్కీ చలవే. ఒత్తిడిలోనూ ఈ జోడీ ఐదో వికెట్‌కు 82 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపుబాట పట్టించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో స్పిన్నర్ నాయిషా గ్వాన్జురా (3/18) తన స్పిన్ మాయతో ఆతిథ్య జట్టుకు ఊహించని షాకులిచ్చింది. రెండు బౌండరీలతో మంధాన (9) ఇన్నింగ్స్‌ను జోష్‌తోనే ఆరంభించినా నాయిషా రాకతో పరిస్థితి తలకిందులైంది. రెండో ఓవర్లోనే బంతినందుకున్న ఆమె.. ఫస్ట్ బాల్కే మంధానను, నాలుగో బంతికి అనుష్క శర్మ (4)ను ఔట్ చేయడంతో టీమిండియాకు ఒకే ఓవర్లో డబుల్ షాక్ తగిలింది.
మూడో ఓవర్లో మావుంగ.. హర్మన్‌ప్రీత్‌ను ఔట్ చేసింది. నాయిషా వేసిన నాలుగో ఓవర్లో షఫాలీ (4).. ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన దీప్తి.. తన అనుభవన్నంతా ఉపయోగించి కీలక ఇన్నింగ్స్ ఆడింది. నాయిషా బౌలింగ్‌లో రెండు ఫోర్లతో ఆమె పరుగుల వేట మొదలెడితే, మరో పక్క నిక్కీ సైతం ఫ్రాన్సిస్కా ఓవర్లో రెండు ఫోర్లు బాదింది. క్రీజులో కుదురుకున్నాక ఈ ద్వయం స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. వ్యక్తిగత స్కోరు 49 వద్ద ఉండగా ఒలిండర్ వేసిన 14వ ఓవర్లో బంతిని లెగ్‌సైడ్ స్వీప్ చేయబోయిన దీప్తి.. షార్నెకు క్యాచ్ ఇచ్చింది. దీప్తి నిష్క్రమించినా నిక్కీ లాంఛనాన్ని పూర్తిచేసింది.
బౌలర్ల కట్టడి
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన జింబాబ్వే తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా ఓపెనర్ కుహ్లీజ్..నాలుగో స్థానంలో వచ్చిన మేయర్స్ ఆ జట్టును ఆదుకున్నారు. మొదట కుహ్లీజ్.. ముపాచిక్వా(16)తో కలిసి రెండో వికెట్‌కు 53 రన్స్ జోడించింది. దీంతో పది ఓవర్లకు జింబాబ్వే 60/1తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ స్పిన్నర్లు చరణి, దీప్తి, షఫాలీ కట్టడి చేయడంతో జింబాబ్వే స్కోరువేగం నెమ్మదించింది. ఆఖర్లో షార్నె.. అరుంధతి వేసిన 18వ ఓవర్లో 6, 4, 4 దంచి స్కోరుబోర్డును వంద పరుగులు దాటించింది.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 20 ఓవర్లకు 114/5 (షార్నె 43*, కుహ్లీజ్ 42, నందని 2/11, చరణి 1/14); భారత్: 15.4 ఓవర్లకు 16/6 (దీప్తి 49, నిక్కీ 39 నాటౌట్, నాయిషా 3/18, మావుంగ 1/19)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

