IND vs SL | రాణించిన అక్షర్ పటేల్, దీపక్.. శ్రీలంక టార్గెట్ 163
టీమిండియాను ఆదుకున్న దీపక్ హుడా, అక్షర్ పటేల్
IND vs SL : తొలి టీ20 టీమిండియా తడబడింది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆల్రౌండర్లు దీపక్ హుడా 41, అక్షర్ పటేల్31 ఆఖర్లో దూకుడుగా ఆడడంతో 20 ఓవర్లకు 162 పరుగులు చేసింది. వీళ్లిద్దరూ ఐదో ఆరో వికెట్కు విలువైన భాగస్వామ్యం నిర్మించారు. ఓపెనర్ ఇషాన్ తొలి ఓవర్ నుంచే లంక బౌలర్ల మీద విరుచుకపడ్డాడు. అయితే.. శుభ్మన్ గిల్ (7) సూర్యకుమార్ యాదవ్ (7)లు వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడింది. సంజూ శాంసన్ (5) మళ్లీ నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా బౌండరీలు బాది శ్రీలంక బౌలర్ల మీద ఒత్తిడి పెంచేదుకు ప్రయత్నించాడు. దూకుడుగా ఆడే క్రమంలో ఇషాన్ 37 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ఆ వెంటనే పాండ్యా 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్లలో మధుషనక, తీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత పర్యటనలో ఆ జట్టు మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. రెండో టీ20 జనవరి 5న, మూడో టీ20 జనవరి 7వ తేదీన జరగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
4 Militants Killed | మణిపూర్లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

