ఆఖరి పోరు
సీనియర్లు అందుబాటులో లేకున్నా.. యువ ఆటగాళ్లు దుమ్మురేపడంతో ఇప్పటికే టీ20 సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. నేడు ఆస్ట్రేలియాతో ఆఖరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. టాపార్డర్ మంచి జోరు మీద ఉండగా.. బౌలర్లు కూడా లయ అందుకున్నట్లే కనిపిస్తున్నారు.
- నేడు భారత్, ఆస్ట్రేలియా చివరి టీ20
- రాత్రి 7 నుంచి
సీనియర్లు అందుబాటులో లేకున్నా.. యువ ఆటగాళ్లు దుమ్మురేపడంతో ఇప్పటికే టీ20 సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. నేడు ఆస్ట్రేలియాతో ఆఖరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. టాపార్డర్ మంచి జోరు మీద ఉండగా.. బౌలర్లు కూడా లయ అందుకున్నట్లే కనిపిస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమే కాగా.. మరి ఆ విజృంభించే వీరులెవరో చూడాలి!

బెంగళూరు: వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న భారత జట్టు.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 3-1తో కైవసం చేసుకున్న యంగ్‌ఇండియా.. ఆదివారం చివరి పోరులో కంగారూలతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి వరల్డ్‌కప్ ఫైనల్ పరాజయానికి కాస్త అయినా బదులు తీర్చుకోవాలని సూర్యకుమార్ సేన భావిస్తుంటే.. విజయంతో పర్యటనను ముగించాలని కంగారూలు చూస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు కాగా.. గత పొరులో మాత్రం అందుకు భిన్నంగా బౌలర్లు రాణించారు. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం కాగా.. భారీ స్కోర్లు ఖాయమే. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూసింగ్ ఫుల్ జోష్‌లో ఉండగా.. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది.
హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మకు తుది జట్టులో అవకాశం కష్టమే. అతడి కోసం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన శ్రేయస్‌ను పక్కన పెట్టకపోవచ్చు. గత మ్యాచ్‌లో చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్‌కు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. ముఖేశ్ కుమార్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్ మరోసారి పేస్ భారాన్ని మోయనున్నారు. ఆస్ట్రేలియా కూడా గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ట్రావిస్ హెడ్ తప్ప వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యులంతా స్వదేశానికి తిరిగి వెళ్లండంతో ఆసీస్ జట్టులో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అయితే కంగారూలను తక్కువ అంచనా వేయడానికి లేదు. హెడ్, డేవిడ్, షార్ట్, వేడ్, ఫిలిప్, ఆరోన్తో కంగారూల బ్యాటింగ్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో బెహ్రన్‌డార్ఫ్‌ను ఎదుర్కోవడం మనవాళ్లకు కష్టంగా మారింది.
పిచ్, వాతావరణం
బౌండ్రీ చిన్నది కావడంతో ఇక్కడ పరుగులు వరద పారడం ఖాయమే. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. మ్యాచ్ కు వర్షం ముప్పులేదు. ఇటీవల ప్రపంచకప్‌లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, రుతురాజ్, శ్రేయస్/తిలక్, జితేశ్, రింకూసింగ్, అక్షర్/సుందర్, దీపక్, రవి, అవేశ్, ముఖేశ్.
ఆస్ట్రేలియా: వేడ్ (కెప్టెన్), ఫిలిప్, హెడ్, మెక్‌డర్మాట్, హార్డీ, టిమ్ డేవిడ్, షార్ట్, డ్వార్షే, గ్రీన్, బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

