IND vs AUS | బ్యాడ్ లైట్.. ముగిసిన మూడోరోజు ఆట.. టీమ్ఇండియా 358/9
బాక్సింగ్ డే టెస్టులో భారత (IND vs AUS) బ్యాట్స్‌మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు. 221కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. ఫాలోఆన్ గండాన్ని గట్టెక్కించిన ఈ బ్యాటింగ్ ధ్వయం జట్టు స్కోరును 350 దాటించారు.
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో భారత (IND vs AUS) బ్యాట్స్‌మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు. 221కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. ఫాలోఆన్ గండాన్ని గట్టెక్కించిన ఈ బ్యాటింగ్ ధ్వయం జట్టు స్కోరును 350 దాటించారు. ఈ క్రమంలో నితీశ్ కుమార్ టెస్టుల్లో తొలి సెంచరీ నమోదుచేయగా, సుందర్ నాలుగో హాఫ్ సెంచరీ చేశాడు. ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయితే సుందర్ 162 బాల్స్‌లో 50 రన్స్ చేసి నాథన్ బౌలింగ్‌లో క్యాబౌట్గా వెనుతిరగడంతో ఈ జోడీ జోరుకు బ్రేక్‌పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా వెంటనే వెనుతిరగడంతో నితీశ్‌కు సెంచరీ చేసే అవకాశం వస్తుందా అనే టెన్షన్ అందరిలో నిండిపోయింది. అప్పటికే 97 రన్స్ చేసిన నితీశ్.. రెండు పరుగులు చేసి 99కి చేరాడు. ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో (ఇన్నింగ్స్ 114.3 ఓవర్) ఫోర్ కొట్టి టెస్టుల్లో తొలి సెంచరీ నమోదుచేశాడు.

హాఫ్ సెంచరీ సమయంలో తగ్గేదే లే అన్నట్లు పుష్ప స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న నితీశ్.. సెంచరీని బాహుబలి స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. గాల్లోకి పంచ్ విసుతూ.. మోకాలిపై కూర్చుని బ్యాట్ హ్యాండిల్‌కు హెల్మెట్ పెట్టి భగవంతునికి కృతజ్ఞత తెలిపాడు. ఈ సమయంలో ప్రేక్షకులతోకలిసి మ్యాచ్ చూస్తున్న నితీశ్ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు. కుమారుడి తొలి సెంచరీని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సంతోషంతో కన్నీరుపెట్టారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

కాగా, నితీశ్ తన తొలి సెంచరీ తర్వాత మరో రెండు పరుగులు జోడించిన తర్వాత.. బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. దీంతో గ్రౌండ్ స్టాఫ్ పిచ్‌ను కవర్స్‌తో కప్పేయడంతో మూడో ఆట ముగిసింది. మూడో రోజు మూడు వికెట్లే కోల్పోయిన టీమ్ఇండియా 191 రన్స్ చేసింది. మొత్తంగా 9 వికెట్లు కోల్పోయి 355 రన్స్ చేసింది. ప్రస్తుతం నితీశ్ (104), సిరాజ్ (2) రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మరో 116 రన్స్ వెనుకపడి ఉన్నది. పంత్ (28), జడేజా (17) రన్స్ చేశారు. టీమ్ఇండియా తరఫున నితీశ్ 104 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ 3 వికెట్ల చొప్పున తీయగా, నాథన్ 2 వికెట్లు పడగొట్టాడు.


Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

