Fensing Asia Cup : వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భారత్ మరో క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రతిష్ఠాత్మక ఫెన్సింగ్ ఆసియా కప్(Fensing Asia Cup) హక్కులు దక్కించుకుంది. జూన్ 19 నుంచి 24 వరకు ఢిల్లీలో ఈ పోటీలు జరుగనున్నాయి. ఫెన్సింగ్ ఆసియా కప్ టోర్నీ ఢిల్లీలో జరపడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఆసియా ఫెన్సింగ్ కాన్ఫెడరేషన్ 39వ సాధారణ సమావేశం కూడా జరుగనుంది.
ఫెన్నింగ్స్లో వార్షిక ఛాంపియన్‌షిప్‌గా పేరొందిన ఆసియా కప్ మరో మూడు రోజుల్లో భారత్‌లో మొదలవ్వనుంది. ఆసియాతో పాటు మధ్య, దక్షిణ ఫసిఫిక్ ప్రాంతంలోని ఫెన్సర్లు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటో.. సత్తా చాటిన వాళ్లను నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయనున్నారు. అంతేకాదు ఫెన్సర్లకు ర్యాంకింగ్స్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా.. 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం లభించనుంది.
India All Set to Host Historic Asian Senior Fencing Championships 2026 in #NewDelhi from June 19 to June 24, 2026.
This monumental event marks the first time India has ever hosted a continental-level fencing championship.
Widely recognized as the “Asia Cup” of fencing, the… pic.twitter.com/dCxXIcRXDU
— DD News (@DDNewslive) June 15, 2026
ఫెన్నింగ్ ఆసియా కప్ నిర్వహించడం భారత్‌లో క్రీడాభివృద్ధికి సంకేతమని భారత ఫెన్సింగ్ సంఘం(FCA) సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా అన్నారు. ‘దేశంలో మొదటిసారి సీనియర్ ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్స్ నిర్వహించడం కీలకమైన ముందడుగు. ప్రపంచస్థాయి ఫెన్సర్లను ఆహ్వానించడంతో పాటు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028 సన్నద్ధతకు శ్రీకారం చుడుతున్నాం. ఈసారి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వీడియో రెఫరల్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాం. ఒలింపియన్ భవానీ దేవీతో కూడిన 24 మంది భారత ఫెన్సర్ల బృందం పోటీ పడనుంది’ అని రాజీవ్ వెల్లడించారు.