Hockey India | 52 ఏండ్ల తర్వాత.. ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయం
రెండ్రోజుల క్రితం బెల్జియం చేతిలో ఓడి ‘పారిస్'లో తొలి ఓటమి రుచిచూసిన భారత హాకీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత, పటిష్టమైన ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో సగర్వంగా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్.. 3-2తో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది.
- హాకీలో క్వార్టర్స్‌కు టీమ్ ఇండియా
- హర్మన్‌ప్రీత్ సూపర్ ఫామ్
Hockey India | పారిస్: రెండ్రోజుల క్రితం బెల్జియం చేతిలో ఓడి ‘పారిస్’లో తొలి ఓటమి రుచిచూసిన భారత హాకీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత, పటిష్టమైన ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో సగర్వంగా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్.. 3-2తో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌కు 52 ఏండ్ల తర్వాత (చివరిసారి 1972 మునిచ్‌లో) ఇదే తొలి విజయం. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతూ దారుణంగా ఓడిన మెన్ ఇన్ బ్లూ.. కీలకమైన పోరులో మాత్రం జూలు విదిల్చింది. 12వ నిమిషంలోనే అభిషేక్ తొలి గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తెచ్చాడు. వాస్తవానికి గోల్ చేసేందుకు లలిత్ బంతిని గోల్ పోస్ట్ వైపునకు పంపాలని యత్నించినా ప్రత్యర్థి గోల్‌కీపర్ ఆండ్రూ చార్టర్ దానిని అడ్డుకున్నాడు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న అభిషేక్ బంతిని దొరకబుచ్చుకుని రాకెట్ వేగంతో దానిని గోల్‌పోస్ట్‌కు పంపించాడు. ఆ వెంటనే 13వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఈ టోర్నీలో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
ఆస్ట్రేలియాకూ పలుమార్లు పెనాల్టీ కార్నర్లు లభించినా చివరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ వాటిని విజయవంతంగా అడ్డుకున్నాడు. అయితే 25వ నిమిషంలో టామ్ క్రెయిగ్ గోల్ కొట్టి ఖాతా తెరిచి ఆ జట్టును పోటీలోకి తెచ్చాడు. కానీ మూడో క్వార్టర్లో హర్మన్‌ప్రీత్ 33వ నిమిషంలో మరోసారి లభించిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటూ భారత్‌కు మూడో గోల్‌ను అందించాడు. 55వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్ కొట్టినా అది ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఈ విజయంతో పూల్-బీలో లీగ్ దశను రెండో స్థానం (9 పాయింట్లు)తో ముగించింది. బెల్టియం (12) అగ్రస్థానంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

