IND Vs AUS ODI | చివరిదైనా నెగ్గేనా.. నేడు భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డే
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టు ఇక చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పోరాట పటిమ కనబర్చాలని చూస్తున్నది.
IND Vs AUS ODI | ముంబై: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టు ఇక చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పోరాట పటిమ కనబర్చాలని చూస్తున్నది. తొలి మ్యాచ్‌లో కంగారూలకు పోటీనివ్వలేకపోయిన హర్మన్‌ప్రీత్ బృందం.. రెండో వన్డేలో విజయానికి చేరువగా వచ్చి విఫలమైంది. రిచ ఘోష్, జెమీమా రోడ్రిగ్స్ రాణించినా.. కీలక సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో టీమ్ఇండియాకు పరాజయం తప్పలేదు. ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకొని సమిష్టిగా సత్తాచాటాలని మేనేజ్మెంట్ కోరుకుంటున్నది.
మరోవైపు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. స్టార్ ప్లేయర్లతో నిండి ఉన్న కంగారూలను అడ్డుకోవాలంటే.. మన అమ్మాయిలు శక్తికి మించి పోరాడాల్సిందే. స్టార్ ఓపెనర్ స్మృతి మంధన, యస్తిక భాటియా, జెమీమా, రిచా, హర్మన్, దీప్తి శర్మ, పూజ వస్ర్తాకర్ సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఇక టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను వణికించిన మన బౌలర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ స్థాయి ప్రభావం చూపలేకపోతున్నారు. ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

