IND vs SL : కసున్ రజిత శ్రీలంకకు రెండో వికెట్ అందించాడు. 116 పరగుల వద్ద శుభ్‌మన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. భారీ షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ బంతి వికెట్లను గిరాటేసింది. సూపర్ ఫామ్ కొనసాగించిన గిల్, విరాట్ కోహ్లీతో 113 రన్స్ జోడించాడు. కోహ్లీ 66 రన్స్‌తో ఆడుతున్నాడు. శ్రేయాస్ అయ్యార్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 35 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
ఈమ్యాచ్‌లో గిల్ సిక్సర్లు, ఫోర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 89 బంతుల్లోనే సెంచరీకి చేరువయ్యాడు. అతని క్లాస్ ఇన్నింగ్స్‌లో 14పోర్లు , రెండు సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ(42)తో 95 రన్స్ జోడించాడు.