IND vs PAK : భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33) ఔట్ అయింది. నష్ర సంధు బౌలింగ్లో షఫాలీ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడింది. అందరూ సిక్సర్ అనుకున్నారు. కానీ, అమీన్ చాలా ఒడుపుగా క్యాచ్ పట్టింది. దాంతో ఈ విధ్యంసక ఓపెనర్ ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ క్రీజులోకి వచ్చింది. జెమీమా రోడ్రిగ్స్ 15 పరుగులతో ఆడుతోంది. 10 ఓవర్లుముగిసే సరికి భారత్ స్కోర్ 67/2. 31 రన్స్ వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తిక భాటియా (17) ఔట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 149 రన్స్ చేసింది.