IND vs NZ : భారీ లక్ష్య ఛేదనలో కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్(2) పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా ఓవర్లో సూర్య కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో ఫిలిప్స్ ఔటయ్యాడు. అంతకు ముందు ఓవర్లో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. మార్క్ చాప్‌మన్‌ను మూడో వికెట్‌గా వెనక్కి పంపాడు. ఆ ఓవర్ తొలి బంతికి డెవాన్ కాన్వే (1) ను పెవలియన్ పంపాడు. కాన్వే నేరుగా పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరి బంతికి చాప్మన్ కీపర్ ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా ఓపెనర్ ఫిన్ అలెన్‌ను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టాడు. ఐదో బంతికి అలెన్ స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ పైకి ఎగిరి మరీ అందుకున్నాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్ క్రీజులో ఉన్నారు.