భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించిన కేఎల్ రాహుల్ (65) పెవిలియన్ చేరాడు. న్యూజిల్యాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్.. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
రాంచీలోని జేఎస్సీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. భారత జట్టుకు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.