IND vs NZ : డారిల్ మిచెల్ న్యూజిలాండ్‌కు నాలుగో వికెట్ అందించాడు. దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (31)ను అవుట్ చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్య క్యాచ్ అవుట్ అయ్యాడు. 26 బంతుల్లోనే 31 రన్స్ కొట్టిన సూర్య వేగంగా ఆడే క్రమంలో వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో గిల్, సూర్య 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ (92) సెంచరీకి చేరువలో ఉన్నాడు. హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 28 ఓవర్లు భారత్ స్కోర్ 177/4.