కివీస్ సిరీస్లో తొలి మ్యాచ్ ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ తొలి వికెట్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని, ప్రమాదకరంగా మారుతున్న న్యూజిల్యాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (51)ను అవుట్ చేశాడు. చాహల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన గప్తిల్ టైమింగ్ మిస్ అయ్యాడు.
దీంతో బాగా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని లాంగాఫ్లో సూర్యకుమార్ యాదవ్ సులభంగా అందుకున్నాడు. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 70/4 స్కోరుతో నిలిచింది.