IND vs ENG 3rd Test | బ్రావో నుంచి క్రాలే దాకా.. అశ్విన్ కీలక మైలురాళ్ల వికెట్ల జాబితా ఇదే..
IND vs ENG 3rd Test | 13 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో అశ్విన్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా అతడు 500 వికెట్ల క్లబ్లో చేరడంతో టెస్టులలో అశ్విన్ తొలి వికెట్ నుంచి ఐదు వందల వికెట్ దాకా కీలక మైలురాళ్లలో ఎవరి వికెట్లను పడగొట్టాడన్నది ఇక్కడ చూద్దాం.
IND vs ENG 3rd Test | భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులలో 500 వికెట్ల క్లబ్లో చేరాడు. రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జాక్ క్రాలేను ఔట్ చేయడంతో అశ్విన్ ఈ ఘనత అందుకున్నాడు. 2011 నుంచి టెస్టులలో ఆడుతున్న అశ్విన్.. 13 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా అతడు 500 వికెట్ల క్లబ్లో చేరడంతో టెస్టులలో అశ్విన్ తొలి వికెట్ నుంచి ఐదు వందల వికెట్ దాకా కీలక మైలురాళ్లలో ఎవరి వికెట్లను పడగొట్టాడన్నది ఇక్కడ చూద్దాం.
2011లో స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్ (నవంబర్ 6)లో ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ తొలి మ్యాచ్‌లోనే 9 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్లో అతడు తీసిన తొలి వికెట్ విండీస్ బ్యాటర్ డారెన్ బ్రావోది. వందో వికెట్‌గా కూడా మరో విండీస్ బ్యాటర్ డారెన్ సామిని ఔట్ చేసిన ఆష్ అన్న.. 200వ వికెట్ గా కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌ను ఔట్ చేశాడు. శ్రీలంక ఆటగాడు లాహిరు గమగెను ఔట్ చేసి 300వ వికెట్ తీసిన ఈ స్పిన్నర్.. 400వ వికెట్‌గా ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వికెట్‌ను సొంతం చేసుకన్నాడు. 500 వ వికెట్ కూడా ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌దే కావడం గమనార్హం.
టెస్టులలో అశ్విన్ మైలురాళ్లు.. ఔటైన బ్యాటర్ల లిస్ట్..
– ఫస్ట్ వికెట్ : డారెన్ బ్రావో (వెస్టిండీస్) 2011
– 50వ వికెట్ : నిక్ కాంప్టన్ (ఇంగ్లండ్) 2012
– 100వ వికెట్ : డారెన్ సామి (వెస్టిండీస్) 2013
– 150వ వికెట్ : ఇమ్రాన్ తాహిర్ (సౌతాఫ్రికా) 2015
– 200వ వికెట్ : కేన్ విలిమయ్సన్ (న్యూజిలాండ్) 2016
– 250వ వికెట్ : ముష్ఫీకర్ రహీమ్ (బంగ్లాదేశ్) 2017
– 300వ వికెట్ : లాహిరు గమగె (శ్రీలంక) 2017
– 350వ వికెట్ : థేనిస్ డి బ్రున్ (సౌతాఫ్రికా) 2019
– 400వ వికెట్ : జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) 2021
– 450వ వికెట్ : అలెక్స్ కేరీ (ఆస్ట్రేలియా) 2023
– 500వ వికెట్ : జాక్ క్రాలే (ఇంగ్లండ్) 2024
– అశ్విన్ సాధించిన ఈ మైలురాళ్లన్నీ సొంతగడ్డమీదే సాధించినవి కావడం గమనార్హం. పైన పేర్కొన్న జాబితాలో తొలి వికెట్‌ను ఢిల్లీలో తీసిన అశ్విన్ ఆ తర్వాత వరుసగా అహ్మదాబాద్, ముంబై, మొహాలీ, కాన్పూర్, హైదరాబాద్, నాగ్‌పూర్, విశాఖపట్నం, అహ్మదాబాద్, నాగ్‌పూర్, రాజ్‌కోట్‌లలో సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

