IND vs ENG 2nd Test: రెండో రోజూ భారత్‌దే.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా
IND vs ENG 2nd Test: తొలి సెషన్లోనే భారత్‌ను ఆలౌట్ చేసి ఆ తర్వాత దంచికొట్టిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఆరు వికెట్ల (6/45)తో చెలరేగాడు.
IND vs ENG 2nd Test: విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజూ భారత్‌దే ఆధిపత్యం. తొలి సెషన్లోనే భారత్‌ను ఆలౌట్ చేసి ఆ తర్వాత దంచికొట్టిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఆరు వికెట్ల (6/45)తో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు (3/71) పడగొట్టాడు. ఇంగ్లండ్ 253 రన్స్‌కు ఆలౌట్ అవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం దక్కగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ సేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లు ఆడి వికెట్లేమీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం ఓవరాల్‌గా 171 పరుగులకు చేరింది.
రెండో రోజు ఉదయమే యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ (209) తర్వాత భారత్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 112 ఓవర్లలో 396 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. ఎప్పటిలాగే దూకుడుగా ఆడింది. ఓపెనర్ జాక్ క్రాలే (78 బంతుల్లో 76, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. డకెట్ (21)తో కలసి తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించాడు. అయితే కుల్దీప్.. డకెట్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు.
బుమ్రా షో..
లంచ్ తర్వాత అర్థ సెంచరీ పూర్తిచేసుకుని శతకం వైపుగా దూసుకెళ్తున్న క్రాలేను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత బుమ్రా హవా మొదలైంది. బుమ్రా వరుస ఓవర్లలో ఓలీ పోప్ (23), జో రూట్ (5)లను ఔట్ చేశాడు. టీ విరామానికి ఇంగ్లండ్ 33 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. టీ తాగొచ్చాక బుమ్రా ఎనర్జీ మరింత పెరిగినట్టుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనీయలేదు. టీ విరామం తర్వాత రెండో ఓవర్లోనే బెయిర్ స్టో (25)ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ (6), రిహాన్ అహ్మద్ (6)లను కుల్దీప్ ఔట్ చేశాడు.
8వ వికెట్‌కు టామ్ హర్ట్లీ (21)తో కలిసి 47 పరుగులు జోడించిన స్టోక్స్ (47)ను బుమ్రా అత్యద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత హర్ట్లీ, అండర్సన్ (6)లను పెవిలియన్‌కు పంపాడంతో ఇంగ్లండ్ 253 రన్స్‌కు ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు యశస్వీ జైస్వాల్ (17 బంతుల్లో 15 బ్యాటింగ్, 3 ఫోర్లు), రోహిత్ శర్మ (13 బంతుల్లో 13 నాటౌట్, 3 ఫోర్లు) మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఆట మరో మూడు రోజులు మిగిలుండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయమే అయినప్పటికీ ఆదివారం భారత్ ఎలా ఆడుతుందన్నది ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

