IND vs BAN | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెంచరీతో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్
IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించడంతో మినీ ప్రపంచకప్‌లో టీమిండియా గెలుపొందింది. 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఇద్దరు 69 పరుగులు జోడించారు. వన్డేల్లో 11వేల పరుగులు చేసిన రోహిత్.. వరుస ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులెత్తించిన రోహిత్ శర్మ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. 36 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయం 41 పరుగులు చేసిన రోహిత్.. తక్సిన్ బౌలింగ్‌లో రషిద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ.. 38 బంతుల్లో 22 పరుగులు చేసిన విరాట్ రషిద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ తక్కువ స్కోర్‌కే అవుట్ అయినా.. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ టీమిండియాను విజయం వైపు నడిపించారు. గిల్ 128 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 47 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో రషిద్‌కు రెండు, తక్సిన్ అహ్మద్, రెహమాన్‌కు చెరో వికెట్ దక్కింది.
దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా జట్టును టీమిండియా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. దాంతో ఓ సమయంలో బంగ్లా 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. జాకిర్, హృదోయ్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో బంగ్లాదేశ్ ఆమాత్రం స్కోర్ సాధించగలిగింది. బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. 118 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో హృదోయ్ సెంచరీ చేసి.. ఆ తర్వాత పెవిలియన్‌కు చేరాడు. హృదోయ్తో పాటు జకీర్ 68 పరుగులతో రాణించాడు. ఈ ఇద్దరు మినహా మరెవరూ రాణించలేకపోయారు. నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరువకుండానే పెవిలియన్‌కు చేరారు. మరో ముగ్గురు బ్యాటర్లు రెండంకెల స్కోరును చేయలేకపోయారు. తంజిద్ హసన్ 25 పరుగులు, రిషద్ హుస్సేన్ 18 పరుగులు మాత్రమే చేశారు. చాలాకాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరిన మహ్మద్ షమీ ఆకట్టుకున్నాడు. ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ వెన్నువిరిచాడు. వన్డేల్లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు, స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు రెండు వికెట్లు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

