IND vs BAN : ఆఫ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కీలకమైన వికెట్ సాధించాడు. బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీంను క్లీన్ బౌల్డ్ చేశాడు. 12వ ఓవర్ చివరి బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రహీం వికెట్ సమర్పించుకున్నాడు. ఇది అక్షర్‌కు రెండో వికెట్. నాలుగో ఓవర్లో అతను ఓపెనర్ అనాముల్ హక్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. మరో ఓపెనర్ లిట్టన్ దాస్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపించాడు. వెంట వెంటనే మూడు వికెట్లు తీసి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టడమే కాకుండా భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. దాంతో, మరో వికెట్ పడకుండా షకిబుల్ హసన్ 30, యాసిర్10 పరుగులతో అలీ ఆచితూచి ఆడుతున్నారు.