భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో మరోసారి వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ (19 బంతుల్లో 43 నాటౌట్) దంచికొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31) మంచి ఆరంభం అందించేందుకు ప్రయత్నించాడు. అయితే కామెరూన్ గ్రీన్ (5), మ్యాక్స్‌వెల్ (0), టిమ్ డేవిడ్ (2) విఫలమవడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించలేదు.
అయితే హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో వేడ్ మూడు సిక్సర్లు బాదడంతో ఆస్ట్రేలియా జట్టు 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. చివరి బంతికి స్టీవ్ స్మిత్ (7) రనౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, బుమ్రా ఒక వికెట్ తీసుకున్నారు.
Matthew Wade's heroics take Australia to a good total of 90.#MatthewWade #AaronFinch #INDvAUS #INDvsAUS #India #Australia #IndianCricketTeam #AustraliaCricketTeam #T20I #T20Is #Cricket #CricketWinner pic.twitter.com/sg5XUJq4Cy
— Cricket Winner (@cricketwinner_) September 23, 2022