Team India | టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాపై వరుసగా రెండో విజయం
టాప్-3 బ్యాటర్లు హాఫ్‌సెంచరీలతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయాన్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో దుమ్మురేపింది.
- రెండో టీ20లో భారత్ జయభేరి
- 44 పరుగులతో ఆస్ట్రేలియా చిత్తు
- మెరిసిన యశస్వి, ఇషాన్, రవి
టాప్-3 బ్యాటర్లు హాఫ్‌సెంచరీలతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయాన్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో దుమ్మురేపింది. యశస్వి జైస్వాల్ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని రుతురాజ్, ఇషాన్ కొనసాగించగా.. ఆఖర్లో రింకూసింగ్ పిడుగుల్లాంటి షాట్లతో కంగారూలపై విరుచుకుపడ్డాడు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు.. ఈ సారి మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో టీమ్ఇండియా సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది.

Team India | తిరువనంతపురం: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని భారత టీమ్ మేనేజ్మెంట్ యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు ఇస్తుండగా.. వాళ్లు వాటిని రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటున్నారు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ఆ ఓటమి నుంచి తేరుకొని టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతున్నది. విశాఖపట్నంలో జరిగిన తొలి పోరులో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో 44 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందేమో అని భావిస్తే.. మన టాపార్డర్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించింది. యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. కెప్టెన్ సూర్యకుమార్ (19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో భారీ షాట్లతో చెలరేగిపోయారు. ముఖ్యంగా నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న రింకూ సింగ్ భారీ షాట్లోతో శివతాండవమాడాడు. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్) ఓ సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలీస్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (45) టాప్ స్కోరర్ కాగా.. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. గత మ్యాచ్ సెంచరీ హీరో ఎలీస్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. స్మిత్ (19), షార్ట్ (19), మ్యాక్స్‌వెల్ (12) ఎక్కువసేపు నిలువలేకపోయారు. టిమ్ డేవిడ్ (37), కెప్టెన్ మాథ్యూ వేడ్ (42 నాటౌట్) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. భారత బౌలర్లలో రవి, ప్రసిద్ధ్ చెరో 3 వికెట్లు పడగొట్టాడు. యశస్వికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం గువాహటిలో మూడో టీ20 జరగనుంది.
టర్నింగ్ పాయింట్!
భారత ఇన్నింగ్స్‌కు యశస్వి మెరుపు ఆరంభాన్నిస్తే.. రింకూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అబాట్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో యశస్వి వరుసగా 4,4,4,6,6తో 24 పరుగులు పిండుకుంటే.. అదే అబాట్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రింకూ సింగ్ 4,6,4,4,6తో 25 పరుగులు రాబట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 235/4 (రుతురాజ్ 58, యశస్వి 53; ఎలీస్ 3/45),
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 191/9 (స్టొయినిస్ 45, వేడ్ 42 నాటౌట్; రవి 3/32, ప్రసిద్ధ్ 3/41).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

