నాకౌట్‌కు బ్రెజిల్
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్ బ్రెజిల్ నాకౌట్లోకి దూసుకెళ్లింది. తమ తొలి మ్యాచ్‌లో సెర్బియాను చిత్తుచేసిన .మలి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ పని పట్టింది. సోమవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన గ్రూపు-జీ మ్యాచ్‌లో బ్రెజిల్ 1-0 తేడాతో స్విట్జర్లాండ్‌పై అద్భుత విజయం సాధించింది.
- స్విట్జర్లాండ్‌పై 1-0తో విజయం
- కొరియాపై ఘనా గెలుపు
- స్పెయిన్-జర్మనీ, కామెరూన్-సెర్బియా మ్యాచ్‌లు డ్రా
దోహా: ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్ బ్రెజిల్ నాకౌట్లోకి దూసుకెళ్లింది. తమ తొలి మ్యాచ్‌లో సెర్బియాను చిత్తుచేసిన .మలి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ పని పట్టింది. సోమవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన గ్రూపు-జీ మ్యాచ్‌లో బ్రెజిల్ 1-0 తేడాతో స్విట్జర్లాండ్‌పై అద్భుత విజయం సాధించింది. కాస్మైరో(83ని) బ్రెజిల్‌కు సూపర్ గోల్ అందించాడు. స్విస్ ఫార్వర్డ్ శ్రేణిని ఏమారుస్తూ కాస్మైరో కొట్టిన గోల్‌తో స్టేడియం ‘974’ ఫ్యాన్స్ కేరింతలు, ఈలలతో హోరెత్తిపోయింది.
సహచరన్నుంచి పాస్ అందుకున్న కాస్మైరో కండ్లు చెదిరే రీతిలో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అప్పటి వరకు స్విస్ గోల్‌పోస్ట్‌పై వరుస దాడులకు పాల్పడిన బ్రెజిల్‌కు నిరాశే ఎదురైంది. ప్రథమార్ధం ఎలాంటి గోల్ లేకుండా ముగియగా, కీలకమైన ద్వితీయార్ధంలో సాంబా జట్టు తమ దాడులకు మరింత పదును పెట్టింది. ప్రత్యర్థి వ్యుహాలకు చిక్కకుండా స్కెచ్ వేస్తూ ప్లేయర్లను మారుస్తూ మ్యాచ్‌ను మరింత రసపట్టుగా మార్చింది. ఓవైపు స్విస్ జట్టు కూడా బ్రెజిల్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా దూకుడు ప్రదర్శించింది. బంతిని 47శాతం బ్రెజిల్ ఆధీనంలో ఉంచుకుంటే 40 శాతం స్విట్జర్లాండ్ ఆధిపత్యం చెలాయించింది.
మొత్తంగా తొమ్మిదిసార్లు గోల్ లక్ష్యంగా దాడి చేసిన సాంబా జట్టు ఒకసారి సఫలం కాగా, స్విస్ నాలుగు సార్లకు పరిమితమైంది. ఓవైపు గాయం కారణంగా స్టార్ స్ట్రైకర్ నెయ్మర్ లేకపోయినా..ఆ లోటు ఏమాత్రం లేకుండా బ్రెజిల్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. మిగతా మ్యాచ్‌ల్లో జర్మనీ, స్పెయిన్ మధ్య మ్యాచ్ 1-1, కామెరూన్, సెర్బియా మధ్య పోరు 3-3తో డ్రాగా ముగిశాయి. గ్రూపు-హెచ్లో ఘనా 3-2తో కొరియాపై గెలిచి ముందంజ వేసింది. ఘనా తరఫున మహమ్మద్ కుదూస్(34ని, 68ని) డబుల్ గోల్స్ చేయగా, మహమ్మద్ సలీసు(24ని) మరో గోల్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

