Imran Mirza | ‘ఖులా’ పద్ధతిలో షోయబ్‌కు విడాకులు.. ‘షరియా చట్టం’ ప్రకారమే అంటున్న సానియా తండ్రి
Imran Mirza : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మూడో పెండ్లి చేసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండో భార్య అయిన సానియా మిర్జా(Sania Mirza)తో విడాకులు కాకముందే మరో వివాహం చేసుకున్నాడా? అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే...
Imran Mirza : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) మూడో పెండ్లి చేసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండో భార్య అయిన సానియా మిర్జా(Sania Mirza)తో విడాకులు కాకముందే మరో వివాహం చేసుకున్నాడా? అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. షోయబ్, సానియాలు ఇప్పటివరకూ తాము డైవోర్స్ తీసుకుంటున్నట్టు బహిరంగంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలో సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా(Imran Mirza) స్పందించాడు.
షోయబ్, సానియాలు డైవొర్స్ తీసుకున్నారని స్పష్టం చేశాడు. ‘ఖులా’ పద్ధతి ప్రకారం సానియా.. మాలిక్‌కు విడాకులు ఇచ్చిందని ఇమ్రాన్ తెలిపాడు. ‘షరియా చట్టంలో పేర్కొన్న ఖలా అనేది ముస్లిం మహిళలకు భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛను ఇస్తోంది. నా బిడ్డ సానియా కూడా ఖులా ప్రకారం షోయబ్‌కు విడాకులు ఇచ్చింది’ అని ఇమ్రాన్ వెల్లడించాడు.

షోయబ్ మాలిక్, సానియా మిర్జాలు 2010లో హైదరాబాద్‌లో ఘనంగా పెండ్లి చేసుకున్నారు. అనంతరం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్లో వలీమా వేడుక జరిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంటకు ఇజాన్(Izhaan) అనే కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం ఇజాన్‌కు నాలుగేండ్లు. అయితే, గత కొంత కాలంగా సానియా, షోయబ్ వేరువేరుగా ఉండడంతో వీళ్ల పన్నెండేళ్ల వివాహబంధం త్వరలోనే ముగియనుందనే వార్తలు వినిపించాయి. అయితే.. మాలిక్, సానియాలు ఎక్కడా తాము విడిపోతున్నామని అధికారికంగా వెల్లడించలేదు. పైగా విడాకుల వార్తలు ప్రచారంలో ఉండగానే వీళ్లిద్దరూ ది మీర్జా మాలిక్ అనే షో లో కలిసి నటించారు.

సానియా కంటే ముందు మాలిక్ హైదరాబాద్‌కే చెందిన అయేషా సిద్దిఖీ(Ayesha Siddiqui)ని 2002లో పెండ్లి చేసుకున్నాడు. అయితే.. 2010లో అయేషాతో వివాహ బంధానికి స్వస్తి పలికి సానియాను మనువాడాడు. ఇప్పుడు షోయబ్ పెండ్లి చేసుకున్న సనా ఒక ఉర్దూ టీవీ సీరియల్ నటి. 2012లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. సనాకుఇది రెండో పెండ్లి. మొదట ఆమె పాక్ నటుడు, సింగర్ ఉమర్ జస్వాల్‌ను 2020లో పెండ్లి చేసుకుంది. అయితే.. మనస్ఫర్థల కారణంగా కొన్ని రోజులకే ఇద్దరూ విడిగా ఉండడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే సనా.. షోయబ్ మాలిక్‌కు దగ్గరైంది.
ఇవి కూడా చదవండి
- Winter Storm | అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. 50 మంది మృతి
- Niranjan Reddy | తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంది: నిరంజన్ రెడ్డి
- BCCI | ఆ ముగ్గురికి లక్కీ చాన్స్.. భారత ‘ఏ’ జట్టులో రింకూ, తిలక్, అర్ష్‌దీప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

