Winter Storm | అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. 50 మంది మృతి
Winter Storm | ఈ శీతాకాలంలో అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను (Winter Storm) వణికిస్తోంది. గత వారం రోజులకుపైగా అక్కడ భారీగా ఎడతెరిపిలేని మంచు కురుస్తోంది.
Winter Storm | ఈ శీతాకాలంలో అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను (Winter Storm) వణికిస్తోంది. గత వారం రోజులకుపైగా అక్కడ భారీగా ఎడతెరిపిలేని మంచు కురుస్తోంది. రహదారులపై దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ శీతాకాలపు తుఫాను కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు యూఎస్ మీడియా శుక్రవారం వెల్లడించింది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు కారణంగా సుమారు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది (weather-related deaths). శీతల ఉష్ణోగ్రతలు, చలి గాలులు, దట్టమైన మంచు పేరుకుపోయిన రహదారులపై జరిగిన ఘోర ప్రమాదాల కారణంగా ఈ మరణాలు నమోదైనట్లు పేర్కొంది.
టేనస్సీ రాష్ట్రంలో 14 వాతావరణ సంబంధిత మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం వెల్లడించింది. అదేవిధంగా.. మక్కా తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ఐదుగురు మహిళలు మంగళవారం పెన్సిల్వేనియా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కెంటుకీలో కూడా ఐదు మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఒరెగాన్ రాష్ట్రంలో మంచు తుఫాను సమయంలో విద్యుత్ పవర్ లైన్ ఆగి ఉన్న కారుపై పడటంతో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోర్ట్‌ల్యాండ్ నగర అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇల్లినాయిస్, కాన్సాస్, న్యూ హాంప్‌షైర్, న్యూయార్క్, విస్కాన్సిన్, వాషింగ్టన్ తదితర రాష్ట్రాల్లో కూడా మరణాలు నమోదైనట్లు యూఎస్ మీడియా వెల్లడించింది.
మధ్య పశ్చిమ ప్రాంతంలో మంచు తుఫాను ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ నార్త్‌వెస్ట్, రాకీ పర్వతాలు, న్యూ ఇంగ్లాండ్, పశ్చిమ న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. న్యూయార్క్‌లోని బఫెలో సమీపంలో ఐదు రోజుల వ్యవధిలో సుమారు 75 అంగుళాల (1.9 మీటర్లు) మంచు కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మంచు తుఫాను కారణంగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో (United States) పాఠశాలను అధికారులు మూసివేశారు. ఈ మంచు తుఫాను ప్రభావం విద్యుత్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. తుఫాను వల్ల లక్షలాది మంది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. ఒక్క ఒరెగాన్ రాష్ట్రంలోనే 75 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు చలిగాలుల తీవ్రత కారణంగా 1.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఈ తుఫాను కారణంగా వెయ్యికిపైగా విమానాలు రద్దయ్యాయి. మరో 8 వేల విమానాలు ఆసల్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. పలు విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు. వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. ఈ వారాంతంలో మంచు ప్రభావం అధికంగా ఉంటుందని ఆ దేశ వాతావరణ విభాగం తెలిపింది.
Also Read..
fire breaks | ఘోర అగ్నిప్రమాదం.. 13 మంది చిన్నారులు మృతి
PM Modi | స్టేజ్‌పైకి వెళ్తూ పడిపోబోయిన సీఎం స్టాలిన్.. సాయం చేసిన ప్రధాని మోదీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

