కాన్కన్(మెక్సికో) : యుఎస్ ఓపెన్ చాంపియన్ కొకొ గాఫ్ డబ్యుటీఏ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో ఇగా స్వియాటెక్ చేతిలో ఓటమి చవిచూసింది. బుధవారం జరిగిన రౌండ్‌రాబిన్ పోరులో గాఫ్ రెండో సెట్లో నాలుగుసార్లు డబుల్‌ఫాల్ట్ చేసి పరాజయంపాలైంది. స్వియాటెక్ 6-0, 7-5 స్కోరుతో గాఫ్‌కు చెక్ పెట్టింది.
రెండో సెట్లో 4-2 ఆధిక్యం సాధించిన గాఫ్ 5-4 వద్ద నాలుగుసార్లు డబుల్‌ఫాల్ట్ చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ విజయంతో స్వియాటెక్ ముఖాముఖి పోరులో ఆధిక్యాన్ని 9-1కి పెంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో స్వియాటెక్ విజయాలు నమోదు
చేసుకున్నది.