Dhoni | బర్త్‌డే బాయ్ ధోనీకి అరుదైన వీడియోతో ఐసీసీ సెల్యూట్

ముంబై: ఇండియన్ టీమ్ గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకడైన ఎమ్మెస్ ధోనీ ( MS Dhoni ) బుధవారం (జులై 7) తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన కెరీర్లో అతను తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి ఓ వీడియో రూపొందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అతనికి బర్త్‌డే విషెస్ చెప్పింది. ఈ ఐదు నిమిషాల వీడియో ఊహించినట్లే 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌తో మొదలైంది. ఆ ఫైనల్ చివరి ఓవర్‌ను జోగిందర్ శర్మలాంటి అనామకుడితో వేయించాలని ధోనీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం చాలా మందికి మింగుడుపడలేదు.
ఆ తర్వాత కూడా ఇలాంటివే ఎన్నో అనూహ్య నిర్ణయాలు కెప్టెన్‌గా ధోనీ తీసుకున్నాడు. ఇలాంటి నిర్ణయాలతోనే 2007 టీ20 వరల్డ్‌కప్‌తోపాటు 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలాంటి విజయాలు సాధించిపెట్టాడు. ఆ వీడియోలన్నింటినీ సంక్షిప్తంగా ఐసీసీ ఇందులో పొందుపరిచింది. నిజంగా అతడు 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రోజున ఇంతకు మించిన ట్రిబ్యూట్ మరొకటి ఉండదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

