దుబాయ్: క్రికెట్లో లింగ వివక్షకు తావులేకుండా ఉండటానికంటూ గత నెలలో బ్యాట్స్‌మన్ అనే పదాన్ని బ్యాటర్‌గా మార్చాలని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సూచించిన విషయం తెలుసు కదా. ఆ మార్పును టీ20 వరల్డ్‌కప్ నుంచి అమలు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. ఆ తర్వాతి నుంచి ఐసీసీ అన్ని టోర్నీల్లో ఇదే రూల్ వర్తించనుంది. బ్యాట్స్‌మన్‌ను బ్యాటర్‌గా మార్చాలన్న ఎంసీసీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలార్డిస్ అన్నారు.
ఇప్పటికే కామెంట్రీలో, ఇతర చానెళ్లలో బ్యాటర్ అనే పదాన్ని వాడుతున్నాం. ఇప్పుడు ఎంసీసీ దానిని క్రికెట్ చట్టాల్లో భాగం చేయాలని నిర్ణయించడం స్వాగతించదగినదే. దానిని మేము అనుసరిస్తాం అని అలార్డిస్ ఒక ప్రకటనలో చెప్పారు. ఇక నుంచీ బౌలర్స్, ఫీల్డర్స్, వికెట్ కీపర్స్లాగే బ్యాటర్స్లోనూ లింగ భేదం ఉండదని చెప్పారు. ఇది చాలా రోజులుగా అనుకుంటున్న మార్పు అని తెలిపారు.