టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక ఖరారు.. పాక్ ఆటగాళ్లకు వీసా లైన్‌క్లియర్

ముంబై : ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు వేదికలు ఖరారయ్యాయి. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక ఆ టోర్నీకి ఇతర వేదికల పేర్లను కూడా రిలీజ్ చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరు, హైదరాబాద్, ధర్మశాల నగరాల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. మరో వైపు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా అవాంతరాలు తొలగినట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ జట్టుకు ఎటువంటి వీసా సమస్యలు ఉండవని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. పాకిస్థాన్ ఆటగాళ్లు వీసా కల్పించే అంశంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు జే షా తెలియజేశారు. ఆటగాళ్లకు వీసాలు ఇచ్చినా.. ప్రేక్షకులకు వీసాలు ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని ఇంకా తేల్చలేదన్నారు. దీనిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంలో ఐసీసీకి ప్రామిస్ ఛేశామన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు తెగిపోవడం వల్ల ఈ రెండు దేశాలు చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక టోర్నీల్లో పాల్గొనడం లేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

