న్యూఢిల్లీ: ఇండియన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ .. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో 239 రన్స్ స్కోర్ చేసిన అతను.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ చెలరేగాడు. ఆ సిరీస్‌లో అతను 124 రన్స్ చేశాడు. మౌంట్ మౌంగనీలో జరిగిన మ్యాచ్‌లో అతను 111 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ తన కెరీర్లోనే అత్యధికంగా 895 పాయింట్లతో టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. అయితే నేపియర్ మ్యాచ్‌లో అతను 13 రన్స్‌కు ఔట్ కావడంతో.. సూర్య పాయింట్లు 890కి పడిపోయాయి. కానీ టాప్ బ్యాటర్ లిస్టులో రెండవ స్థానంలో ఉన్న బ్యాటర్ కన్నా 54 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో రిజ్వాన్(836), కాన్వే, బాబర్లు ఉన్నారు.
🔹 Suryakumar Yadav continues to shine
🔹 A host of Australia stars make big gainsThe latest movements on the @MRFWorldwide ICC Men's Player Rankings ⬇️ https://t.co/3WOEsj9HrQ
— ICC (@ICC) November 23, 2022